ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల వరుస వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరదలు, భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై తక్షణ అంచనాల రూపొందించి సహాయక చర్యలు చేపట్టలేకపోయారన్నారు. ఓవైపు వరదలు, మరోవైపు కరోనా ధాటికి రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారన్నారు. వీరందరికి జీవనోపాధి కల్పించాలని, దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మించాలన్నారు. వైద్యం తదితర సదుపాయాలు కల్పించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే... తడిసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. భారీ వర్షాలు, వరదల కారణంగా ... ఉల్లి, మొక్కజొన్న,పత్తి, ఉద్యాన పంట రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. పంటనష్టం అంచనా, వరద బాధితలకు తక్షణ సహాయం, రైతులకు నష్టపరిహారం, కనీసమద్దతు ధరకు పంట ఉత్పత్తుల్ని కొనుగోళ్లు చేయడం వంటివి యుద్ధప్రాతిపదికన చేయాలన్నారు.


Tags

Next Story