Chandrababu Naidu : చంద్రబాబు దుబాయ్ టూర్ సూపర్ సక్సెస్..

Chandrababu Naidu : చంద్రబాబు దుబాయ్ టూర్ సూపర్ సక్సెస్..
X

సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూనే ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వదిలిపెట్టకుండా అలుపన్నది లేకుండా వయసుతో సంబంధం లేకుండా తన విజనరీని చూపిస్తున్నారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం అంతా అంతా కాదు. ఏపీని 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది. కాబట్టి ఆ విధ్వంసాన్ని పూడ్చాలంటే శక్తికి మించి కష్టపడాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. తన మీద ఏపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పెట్టుబడుల వేటలో భాగంగా దుబాయ్ వెళ్లారు. అక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా రోజుకు ఆరు నుంచి ఏడు సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ పెట్టుబడులను ఆకర్షించారు. దుబాయ్ లోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో దాదాపు 25 సమావేశాలు నిర్వహించి ఏపీకి పెట్టుబడులు పెట్టాలని.. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీలను, ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీలను, ఇతర ఏర్పాట్లు పర్మిషన్లను వివరించి ఏపీకి ఆహ్వానించారు.

విశాఖలో నవంబర్ 14, 15 న జరిగే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కి సదరు కంపెనీలను ఆహ్వానించారు. ఆ సమ్మిట్ వల్ల ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకురావడం చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక పెద్ద అడ్వాంటేజ్. దాన్ని చూపించి ఇతర కంపెనీలను ఈజీగా ఏపీకి తీసుకురావచ్చు. రేపు జరగబోయే సమ్మిట్ లో గూగుల్ డేటా సెంటర్ తో పాటు మెటా డేటా సెంటర్ సికేబుల్ సెంటర్, టిసిఎస్, క్వాంటం, కాగ్నిజెంట్ కంపెనీలు ఏపీకి వచ్చిన విషయాన్ని వివరించి.. ఇతర కంపెనీలకు నమ్మకం కలిగించబోతున్నారు.

ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చిన తర్వాత.. ఇతర కంపెనీలు కూడా అక్కడికి వచ్చేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఎకో సిస్టం డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆ ఉద్దేశంతోటే ముందుగా గూగుల్ డేటా సెంటర్ ను ఏపీకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దుబాయ్ పర్యటన కూడా సక్సెస్ ఫుల్ గా ముగించుకున్నారు. ఏపీకి భారీగా పెట్టుబడును తీసుకురావడం ప్రధాన ఉద్దేశం గా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఆయన దుబాయ్ కి వెళ్తే.. నారా లోకేష్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఇద్దరూ అక్కడి కంపెనీలతో మాట్లాడి.. తమ చతురతతో ఒప్పించి ఏపీలో జరిగే సబ్మిట్ కు ఆహ్వానించారు. ఆయా కంపెనీలు కూడా ఏపీకి వచ్చేందుకు ఒప్పుకుంటున్నాయి.


Tags

Next Story