Chandrababu Naidu : విశాఖలో మరో 7 ఐటీ కంపెనీలు.. చంద్రబాబు విజన్..!

Chandrababu Naidu : విశాఖలో మరో 7 ఐటీ కంపెనీలు.. చంద్రబాబు విజన్..!
X

ఏపీని కూటమి ప్రభుత్వం అత్యంత స్పీడ్ గా అభివృద్ధి చేసే పనిలో పడింది. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఆ విధంగానే ఏపీని తీర్చిదిద్దుతున్నారు. వైసీపీ హయాంలో పారిపోయిన కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా విశాఖను టెక్ హబ్ గా మార్చేస్తున్నారు. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు టీసీఎస్ లాంటి కంపెనీలు వచ్చేశాయి. ఇప్పుడు మరో 7 కంపెనీలకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్, టెక్ తమ్మిన, సత్వా, ఫ్లూయంట్ గ్రిడ్ సహా 7 కంపెనీలు గ్రౌండ్ లెవల్లోకి వస్తున్నాయి. జగన్ హయాంలో ఇలా ఏ కంపెనీకి అయినా శంకుస్థాపనలు చేయడం మనం చూశామా. కేవలం పెట్టుబడులు వచ్చాయి అన్న వార్తల వరకే ఆగిపోయాయి ఆ కంపెనీలు. జగన్ టైమ్ లో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఒక్కటి కూడా శంకుస్థాపన చేయలేదు. ఎందుకంటే వైసీపీ నేతల తీరు అలాంటిది మరి. వాళ్ల బెదిరింపులు, వేధింపులు భరించకలేక చాలా కంపెనీలు ఏపీకి రాకుండా వేరే కంపెనీలకు వెళ్లిపోవడం మనం చూశాం.

కానీ ఇప్పుడు కూటమి పాలనలో మాత్రం ఎంవోయూలు కుదర్చుకున్న కంపెనీలు అన్నీ గ్రౌండ్ లెవల్లో శంకుస్థాపనలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల బిల్డింగులు రెడీ అయిపోతున్నాయి. మిగిలినవి కూడా త్వరలోనే శంకుస్థాపనలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. చంద్రబాబు మార్క్ విజన్ అంటే ఇదే అంటున్నారు కూటమి నేతలు. కేవలం మాటలు చెప్పడం వరకే ఉండదని.. దాన్ని చేతల్లో చేసి చూపించడమే చంద్రబాబు విజన్ అంటున్నారు నేతలు.


Tags

Next Story