విపత్తు ఏదైనా చంద్రబాబు చతురత.. మొంథాను ముంచేశారు..

విపత్తు ఏదైనా చంద్రబాబు చతురత.. మొంథాను ముంచేశారు..
X

సీఎం చంద్రబాబు నాయుడుకు విపత్తులను ఎదుర్కునే సమర్థత ఉన్న నాయకుడిగా పేరుంది. ఇప్పుడే కాదు గతంలోనూ ఎన్నో విపత్తులను సమర్థంగా ఎదుర్కుని భారీ నష్టాలు రాకుండా చూశారు. 2014లో హుద్ హుద్ తుఫాన్, 2018లో తిత్రి తుఫాన్, ఇప్పుడు వచ్చిన మొంథా తుఫాన్ వచ్చినప్పుడు కూడా సీఎంగా చంద్రబాబే ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంటుందో ఏపీ ప్రజలు మరోసారి చూశారు. ఈ సారి చంద్రబాబుకు తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఉన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా యాడ్ అయ్యారు. సీఎం అంటే ఏదో ఒక రివ్యూ పెట్టేసి చేతులు దులుపుకోవడం కాదని చంద్రబాబు నిరూపిస్తున్నారు. చంద్రబాబు స్వయంగా క్షేత్ర స్థాయిలోకి వచ్చి పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై పరిశీలిస్తారు. ఎక్కడ ఇండ్లు మునిగాయి, ఎక్కడ పంటనష్టం జరిగింది, ఎక్కడ స్తంభాలు కూలిపోయాయి, ఎన్ని రోడ్లు కొట్టుకుపోయాయి అనేది లొకేషన్ లోకి వెళ్లి మరి పరిశీలిస్తూ అక్కడికక్కడే పరిష్కరించేలా చూస్తున్నారు.

ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి 11.30 గంటల దాకా.. దాదాపు 12 వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. ఈ ఏజ్ లో కూడా ఇంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు. మంత్రి లోకేష్ అయితే తెల్లవారు జామున 3.30గంటల దాకా ఆర్టీజీఎస్ లోనే ఉన్నారు. ఇంటికి కూడా పోలేదు. అక్కడే పడుకుని తెల్లవారే మళ్లీ పని మొదలు పెట్టారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా కాకినాడ తీర ప్రాంతాల అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్ లు మాట్లాడుతూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఒక్క ప్రాణ నష్టం కూడా లేకుండా, ఎక్కడా సమస్యలు లేకుండా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇలా ఈ ముగ్గురూ నిద్ర కూడా పోకుండా.. అధికారులను నిద్ర పోనివ్వకుండా పరుగులు పెట్టిస్తున్నారు.

ఎక్కడ సమస్య ఉన్నా సరే అక్కడకు వీళ్ల ఆదేశాలు వెళ్తూనే ఉన్నాయి. 11 ఎన్డీఆర్ ఎఫ్, 12 ఎస్టీఆర్ ఎఫ్, పడిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తీసేయడానికి 104 బృందాలను ఏర్పాటు చేశారు. చెట్టు పడిపోయిన నిముషాల్లోనే క్లియర్ చేస్తున్నారు. 11వేల స్తంభాలు, 1210 ట్రాన్స్ ఫార్మర్లు రెడీ చేసి పెట్టారు. 7289 ప్రొక్లెయినర్లు, క్రేన్లను రెడీగా ఉంచారు. చెట్లు పడిపోతే, ఏవైనా నిర్మాణాలు పడిపోతే ఇవి వెంటనే తీసేస్తున్నాయి. తాగునీటి సమస్య లేకుండా 1037 జనరేటర్లు ఏర్పాటు చేశారు. 1204 పునరావాస కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వీటిల్లో 75802 మందిని తరలించారు. వీరందరికీ క్వాలిటీ ఫుడ్, వసతి ఏర్పాట్లు చేశారు. రూ.3వేలు ముందుగానే అందజేశారు. తుఫాన్ బాధిత కుటుంబాలకు ఉచిత సరుకులు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి వెయ్యి అందజేస్తున్నారు. ఇలా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లతో ప్రభుత్వం అలర్ట్ గా ఉంది కాబట్టే ప్రాణ నష్టం జరగలేదు. మొంథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు.


Tags

Next Story