ఆరోగ్య ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ కి చంద్రబాబు లేఖ..!

ఆరోగ్య ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ కి చంద్రబాబు లేఖ..!
తన సొంత నియోజకవర్గం కుప్పంలో రోజురోజుకీ కరోనా తీవ్రంగా విజృంభిస్తోందని, వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కి లేఖ రాశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో రోజురోజుకీ కరోనా తీవ్రంగా విజృంభిస్తోందని, వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుప్పం వంద పడకల ఆసుపత్రికి అదనంగా 50 బెడ్లు పెంచాలని కోరారు. అలాగే ఆక్సిజన్ అందుబాటులోఉండేలా చూడాలని లేఖలో కోరారు చంద్రబాబు. కుప్పంలో బెడ్లు ,ఆక్సిజన్ ,వెంటిలేటర్లను పెంచేలా చేయాలని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ టెస్టులు ఎక్కువ జరిగేలా చూడటమే కాకా అవరమైన మెడికల్ పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story