Chandrbabu : పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదు: చంద్రబాబు

Chandrababu : పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచే సమీక్షలు ప్రారంభించారు. బుధవారం చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కర్త బీద రవిచంద్రతో సమావేశమయ్యారు.
ఆ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని నేతల పనితీరుపై చంద్రబాబుకు నివేదిక అందించారు రవిచంద్ర. నెలలో 15 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని రవిచంద్రకు సూచించారు చంద్రబాబు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు, విబేధాలు లేకుండా నెల రోజుల్లోగా ఒకదారికి తేవాలని సూచించారు. నెల రోజుల తర్వాత కూడా మార్పు రాని నాయకుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com