CM Chandrababu : పద్ధతి మార్చుకో.. ఎమ్మెల్యే దగ్గుపాటికి సీఎం చంద్రబాబు వార్నింగ్

అనేక వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గుపాటిని తన ఛాంబర్‌కు పిలిపించుకొని ఆయన తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. ఇటీవల అనంతపురంలో చోటుచేసుకుంటున్న వరుస వివాదాలు, వాటిలో దగ్గుపాటి పాత్రపై సీఎంకు సమాచారం అందినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, సీఎం వినడానికి నిరాకరించారు. ‘‘నాకు అన్నీ తెలుసు. ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించబోను’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు సమాచారం.
సీనియర్లను కాదని మొదటిసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, తరచూ వివాదాల్లో చిక్కుకుని పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, లేకపోతే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం అనంతపురం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com