West Godavari District: ఉద్యోగ ప్రకటనలు.. మోసగాళ్లకు కాసులు
West Godavari District: కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల ఉద్యోగ ప్రకటనలు మోసగాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పీఏలు, ఉన్నతాధికారులు తమకు బంధువులని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నారు. రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవ పట్నం గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ రైల్వే ఉద్యోగం పేరుతో మోసపోయాడు.. 2018లో రైల్వే బోర్డ్ పరీక్షలు రాసిన ప్రసన్న దగ్గరకు ఎంక్వయిరీ పేరుతో ముగ్గురు వ్యక్తులు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పిస్తామని అందుకు 7లక్షలు ఖర్చు అవుతుందని నమ్మబలికారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట రెండున్నర లక్ష ఆ తరువాత విడతల వారిగా నాలుగు లక్షలు వారి అకౌంట్‌లో వేశాడు.. అయితే సంవత్సరాలు గడుస్తున్నా.. జాబ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com