AP: పులివెందులలో చిరుత కలకలం

AP: పులివెందులలో చిరుత కలకలం
X
తిరుమలలోనూ చిరుత సంచారం.... కీలక హెచ్చరించిన టీటీడీ

తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఏపీలోని కడప జిల్లా పులివెందులలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. 20 రోజులుగా పులులు సంచరిస్తున్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. తాజాగా తుమ్మలపల్లి సమీపంలోని పొలాల్లో చిరుత పులి పిల్లలను స్థానిన రైతులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం లింగాల మండలంలో విద్యుత్ షాక్‌తో మగ చిరుత మృతి చెందింది. తరచూ చిరుత పులులు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.

టీటీడీ కీలక హెచ్చరికలు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని మూసి వేస్తున్నారు.

ఆందోళనలో భక్తులు

తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారంతో మళ్ళీ భక్తుల్లో కలవరం మొదలైంది. నిన్న రాత్రి అలిపిరి నడక దారిలో 7 వ మైలు వద్ద చిరుత కనిపించడం, చిరుత సంచారంపై భక్తులు ఆందోళన మొదలైంది. గుబురుగా ఉన్న చెట్ల మద్య ఉన్న చిరుత నడక మార్గాన్ని దాటే ప్రయత్నం చేస్తుందని భక్తులు భయంతో వణికిపోయారు. కొందరు భక్తుల కదలిక లను గుర్తించిన చిరుత శబ్దానికి అడవి లోకి వెళ్లిపోగా విషయాన్ని భక్తులు టీటీడీ సెక్యూరిటీ దృష్టి తీసుకెళ్లాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని చిరుత జాడ తెలుసుకునే ప్రయత్నం చేసింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.


Tags

Next Story