AP: జైల్లో చెవిరెడ్డి వింత ప్రవర్తన.. పెద్దగా అరుస్తూ...

లిక్కర్ కేసులో అరెస్టై విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదే కేసులో అరెస్టైన, చెవిరెడ్డి అనుచరులు బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణలకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించారు. దీంతో వారిని గుంటూరు జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి.. జైలు గదిలో తలుపును కాలితో తన్నుతూ, పెద్దగా అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇద్దరినీ వేరే జైలుకు తరలించడం ఏంటి? అలా ఎలా తరలిస్తారు? అంటూ గోల చేశారు. తాను ఉన్న జైలుకు తీసుకరాకుండా ఇతర జైలుకు తరలించారన్న కోపంతోనే ఆయన ఇలా ప్రవర్తించినట్లు సమాచారం.
ఈ కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత నెలలో అరెస్టయ్యారు. అప్పటి నుంచి తరచూ ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన రోజు మెడికల్ టెస్టుల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పుడు బస్సు దిగుతూ ఇలాగే అక్కడున్న అందరిమీద చిందులు తొక్కారు. న్యాయమూర్తి రిమాండ్ విధించిన తర్వాత జైలుకు తరలించే సమయంలోనూ కోర్టు హాల్ లోనే పెద్దఎత్తున అరుస్టూ నినాదాలు చేశారు. తనను విచారించడానికి వచ్చిన సిట్ అధికారులపైనా ఆయన అరిచినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లు హాయిగా ఉంది.. ఇప్పుడు చేసిన తప్పులకు జైలుకు వెళ్లడం చెవిరెడ్డికి మింగుడుపడడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com