Chevireddy : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్.. ఇంత ఘోరమా..?

Chevireddy : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్.. ఇంత ఘోరమా..?
X

వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక వింత పిటిషన్ వేశారు. తనతోపాటు జగన్ అడ్డంగా దొరికిపోతాడనే భయంతో ఏకంగా తన సహ నిందితులను వదలొద్దు అంటూ పిటిషన్ వేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే కదా ఏపీలో కల్తీ లిక్కర్ కుంభకోణం ద్వారా వందలాదిమంది ప్రజల ప్రాణాలు తీసిన అరాచక కాండను వైసిపి సాగించింది. ఇందులో అత్యంత కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, జోగి రమేష్, అద్దేపల్లి జనార్దన్ రావు లాంటి వారు ఉన్నారు. అయితే ఈ కేసులో అప్పటి బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి, జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తానని చెప్పిన సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారడానికి రెడీ అయ్యారు. ఈ కల్తీ లిక్కర్ కుంభకోణం గురించి తమకు పూర్తిగా తెలుసని అన్నీ బయటపెడతామని సిట్ ముందు ఒప్పుకున్నారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొత్త కుట్రకు తెర లేపారు.

వైసిపి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ లకు బెయిల్ రాకుండా పిటిషన్ వేయించారు. వాళ్ళిద్దరికీ బెయిల్ వస్తే అప్రూవర్లుగా మారి తమతో పాటు అంతిమ లబ్ధిదారుడు గురించి కూడా బయట పెడతారనే భయంతో ఈ పిటిషన్ వేయించారు. ఇలాంటి దారుణాలు మనం ఎప్పుడైనా చూసామా. చెవిరెడ్డి తప్పు చేయకపోతే అంత భయం ఎందుకు. అప్రూవర్లుగా మారిన వారు నిజాలే చెప్తారు కదా. తప్పు చేయకపోతే చెవిరెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారు కదా. కానీ అలా చేయకుండా వాళ్ళిద్దరికీ బెయిల్ రావద్దని ప్రయత్నించడమేంటి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి కేసులో అయినా అప్రూవర్ గా మారే అవకాశం నిందితులకు ఉంటుంది. ఇలా మారి అన్ని నిజాలు బయట పెడితే వాళ్లకు శిక్షలు తగ్గించడం లేదంటే శిక్ష లేకుండా చేయడం లాంటి వెసలు బాట్లు ఉన్నాయి. అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని సత్యప్రసాద్, వాసుదేవ రెడ్డి అనుకుంటే తప్పేంటి.

దీన్నిబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజంగానే తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా. తప్పు చేయని వాళ్లకు అంతగా భయం ఎన్నడూ ఉండదు. ఇప్పటివరకు సహ నిందితులకు బెయిల్ రావద్దని పిటిషన్ వేయడం ఇదే మొదటిసారి కాబోలు. అడ్డంగా దొరికిపోతామనే భయంతోనే చెవిరెడ్డి ఈ పిటిషన్ వేయించారని తెలిసిపోతోంది. ఈ పిటిషన్ వేయించడం వెనక కూడా జగన్ ఉన్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు అందరూ అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. ఎన్నో కేసులు వాళ్ళ మీద నమోదవుతున్నాయి. కానీ జగన్ వీటి గురించి ఎప్పుడూ మాట్లాడరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తనకు మద్యం అలవాటు లేదని అలాంటి పనులు తాను చేయనని అంటున్నారు తప్ప.. మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులను తాను తీసుకోలేదని ఎక్కడా చెప్పట్లేదు. దీన్నిబట్టి జగన్, చెవిరెడ్డి కుట్ర కోణాలు బయటపడుతున్నాయి.

Tags

Next Story