కోడి కూర తినాలంటే.. ఇక పర్సు చూసుకోవాల్సిందే.. వారంలో వంద పెరిగింది..!

కోడి కూర తినాలంటే.. ఇక పర్సు చూసుకోవాల్సిందే.. వారంలో వంద పెరిగింది..!
కరోనా నేపధ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతుండడంతో చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.

చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కరోనా నేపధ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతుండడంతో చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీనితో చికెన్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే కేవలం వారం రోజుల వ్యవధిలో కిలోపై వంద రూపాయలకు పైగా పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల నాలుగో తేదీ ఆదివారం కిలో రూ.285 ఉండగా.. తాజాగా మంగళవారం మరో రూ. 15 పెరిగి రూ. 300 చేరింది. దీనితో ఇప్పుడు సామాన్యుడు చికెన్ కొనాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల సరుకుల ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ఉంది కానీ... చికెన్, గుడ్లు ధరలు కట్టడి చేసే అధికారం మాత్రం వారి దగ్గర లేదు.

Tags

Read MoreRead Less
Next Story