Chinaveerabhadrudu IAS: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ చినవీరభద్రుడికి జైలుశిక్ష..

X
By - Divya Reddy |2 May 2022 9:15 PM IST
Chinaveerabhadrudu IAS: కోర్టు ఉత్తర్వులు అమలులో జాప్యం చేసినందుకు చినవీరభద్రుడికి న్యాయమూర్తి శిక్ష విధించారు.
Chinaveerabhadrudu IAS: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడికి 4 వారాల సాధారణ జైలు శిక్షతోపాటు 2 వేల రూపాయలు జరిమానా విధించింది ఏపీ హైకోర్టు.. 2021లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు బీపీఈడీ చదువుకునేందుకు వీలు కల్పిస్తూ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది.. బీపీ ఈడీ కోర్సు అభ్యసించే సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది.. అయితే, కోర్టు ఉత్తర్వులు అమలులో జాప్యం చేసినందుకు చినవీరభద్రుడికి న్యాయమూర్తి భట్టు దేవానంద్ శిక్ష విధించారు.. అయితే, అప్పీల్ కోసం శిక్షను రెండు వారాలు సస్పెండ్ చేసింది ధర్మాసనం. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది జీవీఎల్ మూర్తి వాదించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com