Gorantla Madhav: మాధవ్ వీడియోపై విడుదల చేసింది ఫేక్ డాక్యుమెంట్: సీఐడీ చీఫ్ సునీల్

Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోపై కొంతమంది విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదిక ఫేక్ అని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. వీడియో క్లిప్పులను ల్యాబ్‌కు పంపారని, ప్రైవేట్ ల్యాబ్‌లో జరిగేది సరైంది కాదన్నారు. జిమ్ స్టాఫర్డ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఒరిజినల్ కాదని, ప్రచారంలో ఉన్న నివేదిక తాను ఇచ్చింది కాదని జిమ్ స్పష్టత ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిమ్ స్టాఫర్డ్ నుంచి క్లారిటీ తీసుకున్నట్లు చెప్పారు.
వీడియో అథెంటిసిటీపై సునీల్ క్లారిటీ ఇస్తూ.. స్క్రీన్ మీద ఉన్న వీడియో నిజమైందో కాదో ప్రపంచంలో ఎవరూ చెప్పలేరని జిమ్ స్టాఫర్డ్ చేప్పారన్నారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోలో గ్రాఫిక్స్ ఉన్నా ఒరిజినల్‌గానే ల్యాబ్‌లో స్పష్టమవుతుందన్నారు. ల్యాబ్ నివేదిక మార్చమని తనను కొందరు అడిగారని, తాను నిర్ణయం తీసుకునేలోపే సర్టిఫికేట్‌ను మార్చేశారని జిమ్ స్టాఫర్డ్ చెప్పినట్లు సీఐడీ చీఫ్ వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్‌ను ప్రచారంలో పెట్టిన వారిపై ఐటీ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com