తారా స్థాయికి వైసీపీ నేతల మధ్య బిన్నాభిప్రాయాలు

వైసీపీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఒకటి తలిస్తే.. ఎమ్మెల్యే మరోకటి ఆచరిస్తున్నారు. ఇప్పుడు వీరి చేస్టలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కడప కలక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సమిక్షా సమావేశాన్ని కవరేజ్ చేయడానికి మీడియాను అనుమతించకపోవడంపై ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో నేతలు ఏం మాట్లాడారో ప్రజలుకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రహస్యంగా చర్చించుకోవడానికి ఏముందంటూ ప్రశ్నించారు. మీడియాను అనుమతించకపోతే తాను కూడా బయటకు వెళ్లిపోతనంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేమ రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com