జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు

జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత్స్యపురి హరిజనపేటలో జనసేన, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. జనసేన సర్పంచ్ గెలుపు యాత్రలో బాణా సంచా కాల్చడంతో మహిళకు నిప్పంటుకొని ప్రమాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు.. అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతూ భయానక వాతావరణం సృష్టించారు.

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. అటు జనసేన కార్యకర్తలపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారు.

మరోవైపు తనపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మనుషులు దాడి చేశారని స్థానిక యువకుడు ఆరోపిస్తున్నాడు. తనను కొట్టి సెల్ ఫోన్, బైక్‌ను ధ్వంసం చేశారని చెబుతున్నాడు.Tags

Next Story