TTD : తిరుమల పవిత్రత కాపాడాలని సీఎం చంద్రబాబు పిలుపు

TTD : తిరుమల పవిత్రత కాపాడాలని సీఎం చంద్రబాబు పిలుపు
X

తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. తిరుమలలో రెండో రోజు పర్యటించిన ఆయన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను చంద్రబాబు ప్రారంభించించారు. ప్రసాదాల నాణ్యత కొనసాగాలన్నారు చంద్రబాబు. మరో వైపు తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని అధికారులకు సూచించారు. ప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Next Story