CBN: మంత్రి భరత్‌పై సీఎం ఆగ్రహం

దావోస్ పర్యటనలో భవిష్యత్తులో ఏపీ సీఎం లోకేశ్ అంటూ మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని మంత్రిని మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని స్పష్టం చేశారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పుడు, ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. మనం ఇక్కడికి ఎందుకొచ్చాం. మీరు ఏం మాట్లాడుతున్నారని భరత్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్ముందూ ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా చెప్పారు. ‘ఎవరికి నచ్చినా, నచ్చక పోయినా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా, భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేశ్ అని భరత్ వ్యాఖ్యానించారు.CBN: మంత్రి భరత్‌పై సీఎం ఆగ్రహం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com