Minister Anam : నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఫోకస్

Minister Anam : నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఫోకస్
X

ఏపీలో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇందుకుగాను రూ.84 వేల కోట్ల ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని, దీనికోసం సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలపై రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలు

గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయలేక హంద్రీనీవా ప్రాజెక్టును పక్కన పడేసిందని, అయితే కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసిందని మంత్రి ఆనం అన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ కోసం అవసరమైన భూసేకరణకు సీఎం చంద్రబాబు నిధులు కేటాయించారని చెప్పారు. ‘‘గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచన లేకుండా కమీషన్ల కోసం టెండర్లు పిలిచారు. పనులను మధ్యలోనే ఆపేశారు’’ అని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు పనులు

కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు వేగంగా పూర్తవుతున్నాయని ఆనం చెప్పారు. సోమశిల ప్రాజెక్టుకు ప్రస్తుతం 18,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, సోమశిల కండలేరులో 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్థ్యం 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేలకు పెంచుతామని చెప్పిందని, అయితే ఆ పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు.

Tags

Next Story