CM Chandrababu : పిల్లల కోసం సైకిళ్ళు...మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

పిల్లల కోర్కెను తీర్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇటీవలే శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సీఎం హాజరైన సంగతి తెలిసిందే. టీచర్ గా మారి విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు చంద్రబాబు.
ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుకున్న మాధవి కుటుంబం తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాము స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బంది గా ఉందని తమకు సైకిళ్ళు కావలని మాధవి నలుగురు పిల్లలు సీఎం ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నలుగురికి సైకిళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల తో ఈరోజు అధికారులు పిల్లల ఇంటికి వెళ్లి సైకిళ్లను అందజేశారు. దీంతో ఆ పిల్లల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.మాట ఇచ్చిన ఒక్కరోజులోనే సైకిళ్లు అందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సైకిళ్లు తొక్కుతూ ఆనందంగా కేరింతలు కొట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com