CM Chandrababu : మెగా డీఎస్సీ, ‘సుఖీభవ’పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి, వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగులు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను(రైతుకు రూ. 20 వేలు) 3 విడతల్లో అందిస్తాం’ అని వెల్లడించారు.
ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తొలి సారి చూస్తున్నా. నిన్న 11 మంది వైసీపీ సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారు. వారికి సభను గౌరవించే సంస్కారం లేదు. అసెంబ్లీలో నిన్న చీకటి రోజు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com