CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి భూమిపూజ

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తన కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక వైపు E-9 రోడ్ పక్కన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొన్న విషయం తెలిసిందే.
గతేడాది డిసెంబరులో వెలగపూడికి చెందిన రైతు నుంచి 5 ఎకరాల నివాస స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు కుటుంబం, అక్కడ ఇల్లు కట్టడానికి సిద్ధమైంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ వెంటనే భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు.. ఇక్కడ మొత్తం 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1 (G+1) ఇంటిని నిర్మించనున్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి కడతారు.. ఈ స్థలంలో ఎక్కువ భాగం గ్రీనరీ కోసం కూడా కేటాయించాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com