CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేంద్రమంత్రులతో సైతం సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయని..........వాటన్నింటిని రీషెడ్యూల్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితులు లేనందున.. రుణాలను రీషెడ్యూల్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త రుణాలు సైతం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com