CM Chandrababu : నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన

CM Chandrababu : నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన
X

నేడు కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:30 గం.లకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు వద్దకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. 12:50 గం.లకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ వద్దకు రోడ్డు మార్గాన చేరుకోనున్నారు సీఎం. 1:30 గం.లకు బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు.. సాయంత్రం 4:35 గం.లకు తిమ్మరాజుపల్లిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొనున్నారు సీఎం.. 7:05 గం.లకు శాంతిపురం మండలంలోని సొంత ఇంటికి వెళ్ళనున్నారు. రాత్రి శివపురం వద్దనున్న ఇంట్లో బస చేయనున్నారు. ఇక రెండో రోజు సీఎం పర్యటన వివరాలకి వస్తే ఉదయం 10:35 గం.లకు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోనున్నారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఐఎన్సి సెంటర్ ను ప్రారంభిస్తారు. 12:15 నుండి అధికారులతో సమావేశం అవుతారు. 2:30 గం.లకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది. సాయంత్రం 4:10 గం.లకు హెలిపాడ్ నుండి తిరుగుప్రయాణం అవుతారు.

Tags

Next Story