Chandrababu Naidu : దావోస్ కు సీఎం చంద్రబాబు.. కీలక లక్ష్యాలతో ముందుకు..

Chandrababu Naidu : దావోస్ కు సీఎం చంద్రబాబు.. కీలక లక్ష్యాలతో ముందుకు..
X

ఏపీకి ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి వెళ్లారు. నాలుగు రోజుల పాటు 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను అంతర్జాతీయ వేదికపై వివరించబోతున్నారు. తొలి రెండు రోజులు 20కు పైగా దేశాల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. మొదట స్విట్జర్ ల్యాండ్ లో భారత రాయబారి మృథుల్ కుమార్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత వరుసగా పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు పాల్గొని కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్ ఉంది.

తొలిరోజు యూఏఈ మంత్రి అబ్దుల్లాతో సీఎం చంద్రబాబు భేటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడ ప్రముఖ కార్యక్రమాల్లో పాల్గొని ఏపీలో పెట్టుబడులకు కీలక కంపెనీలను ఆహ్వానించబోతున్నారు. పలు సెషన్స్ లో పాల్గొని అనేక బిజినెస్ విషయాలపై మాట్లాడబోతున్నారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎన్నడూ చేయలేదు.

తాడేపల్లి ప్యాలెస్ దాటి ఆయన బటయకు రాలేదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం దావోస్ కు వెళ్లి అన్ని రకాల కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి ఇక్కడి ప్రాంతాన్ని డెవలప్ చేయడంతో పాటు యువతకు ఉపాధిని చూపించాలని పట్టుబడుతున్నారు. ఆయన పట్టుదల ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ తో అర్థమైపోయింది. మరి ఈ సారి ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారనేది చూడాలి.

Tags

Next Story