CM Chandrababu : స్కూలు బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేయాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu : స్కూలు బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేయాలి: సీఎం చంద్రబాబు
X

స్కూళ్లకు విద్యార్థులను తరలించే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో స్కూలు వ్యాను బోల్తా పడి భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అన్ని బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలి. ఫిట్‌నెస్ లేని బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

పరిశ్రమల స్థాపనలో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై సీఎం సమీక్ష చేశారు. ‘దేశంలో మొదటి 5 రాష్ట్రాలతో పోటీ పడేలా, వృద్ధి రేటు 15% లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలి. పారిశ్రామికాభివృద్ధికి చెందిన ముఖ్య పాలసీలు వంద రోజుల్లోగా తీసుకురావాలి’ అని సీఎం వెల్లడించారు.

సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరూ రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పోస్టులు, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం. కాగా నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి 10 శాతం పదవులు కేటాయించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Next Story