CM Chandrababu: రూరల్ వాటర్ సప్లై.. జల్ జీవన్ మిషన్ పై నేడు సీఎం సమీక్ష..

CM Chandrababu:  రూరల్ వాటర్ సప్లై.. జల్ జీవన్ మిషన్ పై నేడు సీఎం సమీక్ష..
X
ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చ..

రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ పై ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు.. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగు నీరు అందించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. అయితే, జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా గత ప్రభుత్వం పక్కని పెట్టిందనే విమర్శలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. తమ హయాంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు.. సెర్ఫ్ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.. డ్వాక్రా సంఘాలతో MSMEలు ఏర్పాటు చేయించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్ ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు.. ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్, రిలేషన్స్ పై రివ్యూ నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

అలాగే మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు బుధవారం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వందరోజుల్లో సాధించిన ప్రగతి.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం. కోట్లమంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు తావులేకుండా ఉండాలి. అలాగని తప్పులు చేసినవారిని ఉపేక్షించం. చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి’’ అని ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి ఆరురోజుల పాటు వివరించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విషప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

Tags

Next Story