Chandrababu: తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Chandrababu:   తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
X
సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి

నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా సొమశీల జలాశయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత జలాశయ మరమ్మతు పనులపై సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాం నారాయణరెడ్డి, నారాయణ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం సత్యవేడు శ్రీసిటిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

అలాగే, మరో 7 సంస్థల ఏర్పాటుకు ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభఇంచనున్నాయి. మరో 1,213 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మరో 1,213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

Tags

Next Story