CM Chandrababu : రేపు పింఛన్లను పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
AP సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతపురం జిల్లా నేమకల్లులో చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో, ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన విషయంగా మారిపోతుంది. అందువల్ల, ప్రభుత్వం డిసెంబర్ 1న పెన్షన్ అందించలేని పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో, పెన్షన్ ను ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం 100 శాతం పంపిణీని ఈ రోజు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ ప్రభుత్వం మొత్తం 26 రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తోంది, వీరిలో వృద్ధులు, వితంతువులు, తలసేమియా బాధితులు, ఒంటరి మహిళలు, అభయహస్తం లబ్దిదారులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు వంటి వర్గాలు ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com