CM Chandrababu : బిల్‌గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు

దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.
దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్- పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ ఛైర్ జాన్ డ్రూతో AP మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో WTCలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్‌ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్‌ను ప్రారంభించాలన్నారు. అటు దేశంలో 13 WTC సెంటర్లు పనిచేస్తున్నాయని, 7 నిర్మాణంలో ఉన్నాయని, ఏపీలో ఏర్పాటును పరిశీలిస్తామని జాన్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com