CM Chandrababu : నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu : నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
X

సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి విజయవాడకు తిరుగు పయనమవుతారు. మరోవైపు, మంత్రి లోకేశ్ ఇవాళ మంత్రాలయంలో పీఠాధిపతి చేతుల మీదుగా గురువైభోత్సవం అవార్డు అందుకోనున్నారు. కాగా.. సీఎం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం, ఇటు కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు మంత్రాలయంలో గురువైభోత్సవం అవార్డును పీఠాధిపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి తోడ్పాటునందించినందుకు ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.

Tags

Next Story