CM Chandrababu : కాసేపట్లో తిరుమలకు సీఎం చంద్రబాబు

CM Chandrababu : కాసేపట్లో తిరుమలకు సీఎం చంద్రబాబు
X

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్రాలను సమర్పించడానికి సతీసమేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు నేడు తిరుమలకు రానున్నారు. సీఎం ఉండవల్లి నుంచి నేడు సాయంత్రం బయలు దేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల లోని పద్మావతి అతిథిగృహంకు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి భేడి అంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.

అనంతరం ప్రభుత్వం తరపున చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారు. రాత్రి తిరుమలలోనే బసచేసి శనివారం ఉదయం తిరుమలలో నూతనం గా నిర్మించిన వకుళా మాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.

Tags

Next Story