CM Chandrababu : పల్నాడు జిల్లాలో 1న సీఎం చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సరంలో తొలి రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నరసరావుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తొలుత గురజాలలో పర్యటించాలని అనుకున్నా.. బీసీ ఎమ్మెల్యే ఉన్నచోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో నరసరావుపేటకు మార్చినట్లు తెలుస్తోంది. రొంపిచర్ల మండలం అన్నవరంలో చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారుల పనుల్ని వేగవంతం చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న పనుల్ని కూడా తిరిగి ప్రారంభిస్తోంది. ఈ మేరకు బాపట్ల జిల్లా వాడరేవు - పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జాతీయ రహదారి 167ఏ విస్తరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ నేషనల్ హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ రోడ్డుకు సంబంధించి అడ్డంకుల్ని అధిగమించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కొంతమంది రైతులు నరసరావుపేట బైపాస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు.. అలైన్‌మెంట్ మార్పించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ బైపాస్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com