CM Chandrababu : కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
X

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఈ ఏడాది అన్నింటా శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అటు కొత్త ఏడాది సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది రోజున దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్లల్లోనూ మంచి స్ఫూర్తి కనిపిస్తోందని చెప్పారు.

Tags

Next Story