CM Chandrababu : సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం : సీఎం చంద్రబాబు

సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం.. జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామన్న సీఎ చంద్రబాబు.. భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. సర్వే వల్ల సెంటు, 2 సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయని.. . ఇప్పటి వరకు 95,200 పిటిషన్లు వచ్చాయి. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ, ఇతర అంశాల్లో కచ్చితత్వం ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, తానే స్వయంగా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అన్నదాతలకు సేవ చేసే విషయంలో తప్పు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com