AP : మీ లక్ష్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలి - సీఎం చంద్రబాబు

AP : మీ లక్ష్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలి - సీఎం చంద్రబాబు
X

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణపయ్యలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. "మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నా.” అని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Tags

Next Story