AP : ఆగస్టు 5న కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ

AP : ఆగస్టు 5న కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ
X

పథకాలపై ఉన్నత స్థాయి రివ్యూపై చంద్రబాబు ఫోకస్ చేశారు. వచ్చేనెల 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) అధ్య క్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

ఇప్పు టికే కూటమి ప్రభుత్వం అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీలు చేసింది. వారంతా కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలను జిల్లాల కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Tags

Next Story