AP: వేట్లపాలెం పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం

AP: వేట్లపాలెం పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
X
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుళ్ల ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి జరిగిన సహాయక చర్యలపైనా ఆరా తీశారు. ఘటన తీవ్రతను సీఎం చంద్రబాబుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రం ఎవరిదని, ఎప్పటి నుంచి ఉందని, అనుమతులు ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. అటు క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లనున్నారు.

మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి కారణాలు... ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లి, సహాయ చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భారీ పేలుడు విషాదకరమని, తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

కా­కి­నాడ జి­ల్లా వే­ట్ల­పా­లెం­లో­ని బా­ణా­సం­చా పరి­శ్ర­మ­లో జరి­గిన భారీ వి­స్ఫో­ట­నం­లో పలు­వు­రు మృతి చెం­దా­ర­ని తె­లి­సి ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్ తీ­వ్ర ది­గ్భ్రాం­తి­కి గు­ర­య్యా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు ఆయన ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­పా­రు. ఆ కు­టుం­బా­ల­కి ప్ర­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ద­ని భరో­సా ఇచ్చా­రు. ఈ ఘట­న­పై తె­లి­య­గా­నే జి­ల్లా కలె­క్ట­ర్‌­తో పవన్ కల్యా­ణ్ మా­ట్లా­డా­రు. ప్ర­మా­దం వి­వ­రా­లు తె­లు­సు­కు­న్నా­రు. కలె­క్ట­ర్, ఎస్పీ ఘటన స్థ­లం­లో ఉండి పరి­స్థి­తి­ని, సహా­యక చర్య­ల­ను పర్య­వే­క్షిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. క్ష­త­గా­త్రు­ల­ను మె­రు­గైన వై­ద్యం అం­దిం­చా­ల­ని సూ­చిం­చా­రు. బా­ణా­సం­చా పరి­శ్ర­మ­ల­పై అధి­కా­రు­లు ఎప్ప­టి­క­ప్పు­డు నిఘా ఉంచి భద్రత చర్య­ల­ను తని­ఖీ చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు. పరి­సర గ్రా­మా­ల­కు పొగ అలు­ము­కు­న్న క్ర­మం­లో ఆయా గ్రా­మాల ప్ర­జ­ల­కి ధై­ర్యం చె­ప్పి, వై­ద్య సి­బ్బం­ది­ని అం­దు­బా­టు­లో ఉం­చా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. రా­ష్ట్ర పర్యా­టక శాఖ మం­త్రి కం­దుల దు­ర్గే­ష్, కా­కి­నాడ ఎంపీ తం­గె­ళ్ల ఉదయ్ శ్రీ­ని­వా­స్‌­ల­ను ఘటన స్థ­లా­ని­కి వె­ళ్లి బా­ధిత కు­టుం­బా­ల­కు ధై­ర్యం చె­ప్పా­ల­ని పవన్ కళ్యా­ణ్ ఆదే­శిం­చా­రు.

Tags

Next Story