CM Jagan : నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ
నిన్న ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) భేటీ కానున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో (Nirmala Sitharaman ) ఉదయం గం. 11.45ని.లకు భేటీ అవుతారు జగన్. అనంతరం హోమంత్రి అమిత్ షాతో (Amit Shah) కూడా జగన్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.
సీఎంకు ఢిల్లీ విమానాశ్రయంలో సీఎంకు వైఎస్సార్‌సీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, నందిగం సురేష్, రెడ్డప్ప, అయోథ్య రామిరెడ్డి, వంగా గీత, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, ఎం.గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com