విశాఖలో సీఎం పర్యటన.. కార్మిక సంఘాల నేతలు అరెస్టు

విశాఖపట్నంలో ఇవాళ సీఎం పర్యటన సందర్భంగా కార్మిక నేతల ముందస్తు అరెస్టులు కలకలం రేపుతున్నాయి. CITU విశాఖ అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. దుర్తి CITU కార్యదర్శి అప్పలరాజును అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.
అలాగే TNSF అధ్యక్షుడు ప్రణవ్‌ను కూడా అరెస్టు చేసి PSలో పెట్టారు. మరికొందరు కార్మిక సంఘాల నేతలపైనా పోలీసుల ఆంక్షలు విధించారు. ఈ నిర్బంధాలు, ఆంక్షలపై యూనియన్లు మండిపడుతున్నాయి. ఉక్కు ఉద్యమానికి వైసీపీ సంఘీభావం తెలుపుతుంటే అరెస్టులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అటు, స్టీల్‌ప్లాంట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇక ఇవాళ శారదాపీఠం వార్షికోత్సవం సంద్భంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు CM జగన్ విశాఖ వెళ్తున్నారు. చినముషివాడ వెళ్లి అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు. ఐతే.. ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌ను కలిసేందుకు కార్మిక సంఘాల ప్రయత్నం చేస్తున్నాయి.
కార్మిక సంఘాల ముందస్తు అరెస్టులతో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని అనుకుంటోందా అంటూ.. కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com