హిందూ సంఘాలు భగ్గుమన్నా.. విపక్షాలు పట్టుబట్టినా పట్టించుకోని జగన్

హిందూ సంఘాలు భగ్గుమన్నా.. విపక్షాలు పట్టుబట్టినా పట్టించుకోని జగన్
హిందూ సంఘాలు భగ్గుమన్నా, విపక్షాలు సైతం డిక్లరేషన్‌కు పట్టుబట్టినా తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తాను అనుకున్నట్టే వ్యవహరించారు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి..

హిందూ సంఘాలు భగ్గుమన్నా, విపక్షాలు సైతం డిక్లరేషన్‌కు పట్టుబట్టినా తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తాను అనుకున్నట్టే వ్యవహరించారు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి. స్వామివారిని దర్శనం చేసుకున్న సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆలయంలోకి ప్రవేశించారు. నిన్న పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడే డిక్లరేషన్‌పై రగడ తారాస్తాయికి చేరింది. ఐతే.. CM వాటిని పట్టించుకోలేదు. ఇవాళ ఉదయం వెంకన్న దర్శనానికి వచ్చిన సమయంలో TTD ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, EO అనిల్ సింఘాల్ సహా అధికారులంతా CMకు స్వాగతం పలికారు. అటు, కర్నాటక సీఎం యడ్యూరప్ప కూడా తిరుమలేశుడిని దర్శించుకున్నారు. ఇద్దరు సీఎంలకు దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.

వెంకన్న దర్శనం తర్వాత నాదనీరాజన వేదికపై సుందరకాండ పారాయణంలో సీఎంలు ఇద్దరూ పాల్గొన్నారు. తర్వాత తిరుమలలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కర్నాటక రాజ్య సత్రాలకు యడ్యూరప్పతో కలిసి శంకుస్థాపన చేశారు. టీటీడీకి ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం నుంచి 200 కోట్ల నిధుల్ని అందాయి. 7 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐదు కాంప్లెక్స్‌లలో రోజుకు 1800 మందికి వసతి కల్పించేలా వీటిని సిద్ధం చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story