YS Jagan : కులాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్న జగన్.

YS Jagan : కులాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్న జగన్.
X

మాజీ సీఎం జగన్ అభివృద్ధి పేరు చెప్పుకోవడానికి వీలు లేదు కాబట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి కూటమి మధ్య చీలిక తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నట్టు అధికార పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి కమ్మ, కాపు, బిజెపి కలిసి ఉన్నంతకాలం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాలేరని తేల్చి చెప్పారు. బహుశా దాన్ని ఆధారంగా చేసుకుని జగన్ కొత్త కుట్రలకు తరలిపోయినట్టు తెలుస్తోంది. జనసేన, టిడిపి, బిజెపిని విడదీయడానికి అంబటి రాంబాబును, జోగి రమేష్ ను రంగంలోకి దించారంట. సీఎం చంద్రబాబు నాయుడును అత్యంత దారుణంగా తిట్టమని అంబటి రాంబాబుకు జగన్ ముందే ఆర్డర్ వేసినట్టు సమాచారం. అలా తిట్టిన తర్వాత టిడిపి కార్యకర్తలు ఆందోళన చేయడానికి వస్తారని.. అందులో వైసిపి నేతలు చొరబడి నీ ఇంటి మీద దాడి చేస్తారు అని స్క్రిప్టు రాసినట్లు లీక్ అవుతుంది.

అలా దాడి చేసిన తర్వాత టిడిపి కాపు కులం మీద దాడి చేసింది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించాలని జగన్ ప్లాన్. తద్వారా కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చుపెట్టి కూటమి పార్టీల మధ్య చీలిక తీసుకురావడమే జగన్ అసలు కుట్ర అని తేలిపోయింది. జోగి రమేష్ తో లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయించడం వెనుక కూడా ఇలాంటి కుట్రమే ఉంది అని అంటున్నారు కూటమినేతలు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఇలా పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి కులాల మధ్య కుట్రలు చేస్తున్నారు జగన్.

కాపులను కాపులతో తిట్టించడం, కమ్మ నేతలను కమ్మనేతలతోనే తిట్టించడం జగన్ కు అలవాటు అయిపోయింది. ఇలాంటి కుట్రలు చేసే అధికారంలోకి రావాలి అనుకోవడం ఎంత దారుణం అసలు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అభివృద్ధి పేరుతో ఓట్లు అడగాలి. అంతేగాని కులాల మధ్య కుట్రలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం జగన్ గుర్తుంచుకోవాలి.

Tags

Next Story