Andhra Pradesh News : పోలీసులను బెదిరిస్తున్న జగన్.. అండగా చంద్రబాబు, పవన్

Andhra Pradesh News : పోలీసులను బెదిరిస్తున్న జగన్.. అండగా చంద్రబాబు, పవన్
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల వర్గాలకు అండగా ఉంటుంది. అటు ప్రజలను వేధిస్తే ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా సరే కఠినంగా చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇటు అధికారులను వైసీపీ నేతలు వేధిస్తే అస్సలు సహించట్లేదు. మనం చూస్తున్నాం కదా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో. మరీ ముఖ్యంగా సభలు పెట్టిన ప్రతిచోట పోలీసు అధికారులకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని.. అప్పుడు పోలీసు అధికారుల తాటతీస్తా, ఉతికి ఆరేస్తా అంటూ డైలాగులు కొడుతున్నాడు. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న ఎవరికైనా సరే తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ అనేది ఏంటంటే వాళ్ళ పార్టీ నేతలు ఎన్ని తప్పులు చేసినా సరే పోలీసు అధికారులు చూస్తూ కూర్చోవాలి అంటున్నారు.

జగన్ చెప్పేది ఎలా ఉంది అంటే వైసిపి వాళ్ళు ఏం చేసినా సరే కరెక్టే గాని దాన్ని ఎవరు తప్పు పట్టదు అన్నట్టు ఉంది. పోలీసులు ఒకవేళ తప్పు పడితే కేసులు పెడితే వాళ్లకు వార్నింగులు ఇవ్వడం జగన్ కు అలవాటు అయిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అలా కాదు. నిన్న కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ లకు నియామక పత్రాలు అందజేస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. జగన్ పోలీసులను బెదిరిస్తున్నాడు గానీ తాము మాత్రం వాళ్లకు అండగా ఉంటామని చెప్పారు.

తప్పు చేస్తే ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటాం కానీ.. అదే అధికారులకు కష్టం వస్తే కచ్చితంగా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జగన్ లాంటి వాళ్లు సమాజానికి హానికరమని.. అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఉద్యోగాలు ఇస్తూనే ఉంటామని.. సంపదను సృష్టించడమే తమ కర్తవ్యం అని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం 24 లక్షల ఉద్యోగాలు 2029 వరకు ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

Tags

Next Story