చెప్పడం కాదు.. చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తుండగా.. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీ వైపు అడుగులు వేస్తున్నాయి. కేవలం ఎంవోయూలతో సరిపెట్టకుండా.. ఆ కంపెనీలకు వెంటనే శంకుస్థాపనలు చేసి, ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైసీపీ హయాంలో పెట్టుబడుల పేరుతో ఒప్పందాలు కుదుర్చుకుని వాటిని ఫైల్స్‌కే పరిమితం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అలాంటి విమర్శలకు తావివ్వకుండా, ఒప్పందాల తర్వాత వెంటనే పనులు మొదలుపెడుతోంది. కాకినాడలో నేడు గ్రీన్ కో కంపెనీ ఏర్పాటు చేస్తున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర పరిశ్రమల చరిత్రలోనే కీలకమైన ప్రాజెక్టుగా ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా గ్రీన్ కో కంపెనీ ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం 1950 మెగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్‌ను ఎగుమతి చేయబోతోంది. ఇది కేవలం రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణంగా నిలిచే స్థాయి ప్రాజెక్టు అని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను సింగపూర్, జపాన్, జర్మనీ, లండన్ వంటి కీలక అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది కంపెనీ. దీంతో ఏపీ పేరు గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మ్యాప్‌లో మరింత బలంగా వినిపించనుంది. ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్ కో సంస్థ రూ.18 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెడుతోంది. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ.
దీని ద్వారా కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆర్థిక చలనం పెరగనుంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో లక్షల కోట్ల ఎంవోయూలు కుదిరాయని ప్రచారం చేసింది. కానీ వాస్తవంగా చూస్తే.. ఒక్క పెద్ద కంపెనీ కూడా ఇలా శంకుస్థాపన దశకు చేరలేదు. డబ్బా కొట్టుకునే ప్రకటనలే తప్ప.. గ్రౌండ్ లెవల్‌లో పరిశ్రమలు కనిపించలేదన్నది వాస్తవం. ఇప్పుడు కూటమి హయాంలో వందలాది కంపెనీలు ఏపీలో ఆల్రెడీ పనులు మొదలు పెట్టాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

