AP : నేడు కలెక్టర్ల సదస్సు.. ఎజెండా ఇదే

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా అక్కడి ప్రజల స్థితిగతులపై సర్వే, బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంపై చర్చించనున్నారు. వైసీపీ హయాంలో భూఅక్రమాలు, డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ సేద్యం, మాతాశిశు మరణాలు, రోడ్ల నిర్మాణం, అమరావతిలోని R5 జోన్‌పై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పేషీ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ , హోం శాఖల మంత్రులు, డీజీపీ, సీఎస్ సిబ్బంది మినహా మరెవరూ కలెక్టర్ల సదస్సు సమావేశ హాలుకు అనుమతి లేదని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ప్రజెంటేషన్లను వారే తెచ్చుకోవాలని సూచించారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పెట్టుకోవాలని సూచనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com