AP: నేడు కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు. ఆతర్వాత ప్రాధాన్యతను బట్టి ముందుగా వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీశాఖలపై సమీక్ష జరపనున్నారు. అనంతరం గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు. ఆ తర్వాత గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయల కల్పనపై సమీక్ష జరపనున్నారు.
లంచ్ తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై చర్చించనున్నారు. చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై సమీక్ష చేయనున్న సీఎం. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై చర్చించనున్నారు. సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, HODలు మినహా ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ప్రజెంటేషన్లను వారే తెచ్చుకోవాలని సూచించారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పెట్టుకోవాలని సూచనలు చేశారు.
వైసీపీ కార్యాలయం మూసివేత
: అద్దె చెల్లించలేక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని మూసేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావును ప్రకటించాక ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచే ప్రచార కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. అప్పుడు కార్యాలయ నిర్వహణ ఖర్చులు అధిష్ఠానమే భరించింది. అయితే ఎన్నికల్లో 42 వేల ఓట్ల పైచిలుకు తేడాతో నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడంతో రెండు నెలలుగా కార్యాలయ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలకు ముందు నియమించిన ముగ్గురు పరిశీలకులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాన్ని మూసేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను సైతం తొలగించేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com