Srisailam : శ్రీశైలం కుడిగట్టులో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఏపీ జన్కో అధికారులు ప్రారంభించారు. దిగువన ఉన్న నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీ వరకు నీటిని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్ కు విడుదలచేసేందుకు కృష్ణా నది యాజమాన్యం బోర్డు అధికారులు అంగీకరించారు.
దీంతో శ్రీశైలం ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మంగళవారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రస్తుతం 15,919 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు మూడు టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు విడవడానికి సుమారు మూడు రోజుల సమయం పట్టవచ్చని జెన్కో అధికారులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com