Polavaram Project : నేటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషీన్లు వచ్చేశాయి. గరిష్ఠంగా 90 మీ. లోతు వరకు నదీగర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్‌తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది.
డయాఫ్రంవాల్‌పైనే ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం నిర్మించనున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తయితే గోదావరి నీటిని రిజర్వాయర్‌లో ఒడిసిపట్టేందుకు వీలవుతుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయవచ్చు. గతంలో తెలుగుదేశం హయాంలోనే డయాఫ్రంవాల్ నిర్మించినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2020 గోదావరి వరదలకు డయాఫ్రమ్ వాల్ మూడు చోట్ల దెబ్బతింది. ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి, ఇసుకను వైబ్రో కాంపక్షన్ విధానం లో గట్టిపరిచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపడుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com