Power Cut in AP :ఏపీలో రెండ్రోజులుగా కరెంట్ కోతలు

ఆంధ్రప్రదేశ్‌లో.. నిన్నటి నుంచి పలు జిల్లాలో కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలమైన... పవర్ కట్ లు మాత్రం ఆగడం లేదు. నిన్న రాత్రి నుంచి ప్రజలు నరకం అనుభవించారు. విద్యుత్ కోతలపై అధికారులు ఎవరూ స్పందించలేదు. గత రెండ్రోజుల్లో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల ప్రాంతాల్లో.. విద్యుత్ కోతలతో.. ఆయా గ్రామాల ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. కరెంటు లేక చిన్నారులు, వృద్ధులు తల్లడిల్లిపోతున్నారని, విద్యార్ధులు సైతం.. చదువుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. సరైన సమాచారం అందించే అధికారులు లేకపోవడంతో... రోడ్లపై వచ్చిన ధర్నా చేశారు ప్రజలు.
అటు మంగళగిరి నియోజకవర్గంలో ఇదే పరిస్ధిది. దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామంలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రోజూ రాత్రి పూట కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు. స్థానిక విద్యుత్ కార్యాలఁ వద్ద ఆందోళనకు దిగారు..
https://www.youtube.com/watch?v=5bTM8-iXUl4
మరోవైపు... సత్యసాయి జిల్లాలోనూ... రైతులు ఆందోళనకు దిగారు. రౌళ్ల మండలం కేంద్రంలో విద్యుత్ ఉప కేంద్రం వద్ద ప్రజలు నిరసన చేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ మండిపడ్డారు. సిబ్బంది కార్యాలయానికి తలుపువలు వేసి గేటు బయట కంప వేసి నిరసన వ్యక్తం చేశారు. 9 గంటలు విద్యుత్ ఇస్తామన్న నమమకంతో... లక్షలు అప్పు చేసి పంటలు సాగుతున్న చేస్తున్నామని.. కానీ కేవలం మూడ గంటలు, అది కూడా కోతలతో విద్యుత్ సరఫరా చేస్తున్నారంటున్నారు రైతులు.
అటు గుంటూరు జిల్లా పొన్నూరులోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ములుకుదురు గ్రామంలో.. విద్యుత్ కోతలను నిరసిస్తూ... ఆందోళనకు దిగారు ప్రజలు. జీబీసీ రోడ్డుపై రాస్తోరోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గత రెండ్రోజులుగా రాత్రి పూట కరెంట్ కోతలు...విధిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతన్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com