ఏపీలో రోడ్డెక్కిన కాంట్రాక్టు లెక్చరర్లు

ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్లు రోడ్డెక్కారు.విభజన సమయానికి ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జగనన్నకు చెబుదాం- కాంట్రాక్టు లెక్చరర్ల గోడు అంటూ సమావేశమయ్యారు.ఈ నేపధ్యంలోనే కాంట్రాక్టు లెక్చరర్ల JACని ఏర్పాటు చేసింది.కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో లోపలికి వెళ్లి, సదస్సు కొనసాగించారు.ఇవాల్టీ నుంచి 24 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే 25న మరో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడా సర్వీసు నిబంధన పెట్టలేదని, అదే ఉంటే తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించారని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రశ్నించింది.
ఐదేళ్ల సర్వీసు ఉన్నవారినే క్రమబద్ధీకరించాలని ఏ కోర్టు చెప్పిందని? సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణకు వర్తించదని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు ఐదు, పదేళ్లు అని ఎక్కడా చెప్పలేదని. క్రమబద్ధీకరించడం ఆర్థికభారం అంటున్నారని,ఐతే కాంట్రాక్టు వాళ్లంతా మంజూరైన పోస్టుల్లోనే పనిచేస్తుంటే ఆర్థికభారం ఎలా అవుతుందని అన్నారు. ఈ విషయాలను ప్రజాప్రతినిధులందరికీ చెప్పాలని. కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తారని. దాన్ని అందరూ గమనించాలని సమావేశంలో కోరింది జీఏసీ.
ఇక కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్... విభజన సమయానికి ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.‘అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని,కాంట్రాక్టు ఉద్యోగులనూ సర్వీసు నిబంధన లేకుండా క్రమబద్ధీకరించాలని అన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని..జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసే సమయంలో క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో కూడా పెట్టారని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com